Search

Monday, March 11, 2013

Science Exhibition in Christ High School

Science Exhibition was conducted in CHRIST High School on( 7th and 8th March,2013).
Look At the following pictures.I have collected these pictures from the Christ High school Head Mistress Beena.































Monday, February 11, 2013

Kalyana Mandapam Praarambham

                                                  కళ్యాణ మండపం ప్రారంభం 

తాడిపత్రిలోని అమ్మవారి శాలలో జైని  పెద్ధరంగయ్య ,అచ్చమ్మల కళ్యాణ మండపాన్ని సోమవారం (11/02/2013)ప్రారంభించనున్నారు .ముఖ్య అతిధులుగా చిన్ననీటి పారుదల శాఖ మంత్రి TG వెంకటేష్,MLA JC దివాకర్ రెడ్డి,JC ప్రభాకర్ రెడ్డి లు హాజరవుతారని ఆర్యవైశ్య సంగ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. మండప నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించనట్లు  తెలిపారు.పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు 

Sunday, February 10, 2013

Indoor Stadium Ki Bhumi Pooja

                                              ఇండోర్ స్టేడియం కి భూమి పూజ 

నూతన పురపాలక కార్యాలయం సమీపంలో సోమవారం(11/02/2013) ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నట్లు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు.స్టేడియం నిర్మాణానికి క్రీడాకారులు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే 50 మంది సభ్యులు రూ 50 వేల వంతున సభ్యత్వం తీసుకున్నారు.కొంత ప్రభుత్వ నిధులతో పాటు క్రీడాకారుల సభ్యత్వం ద్వారా వచ్చే మొత్తంలో నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.ఇందులో బ్యాడ్మిటన్ ,వాలీబాల్,బాస్కెట్ బాల్ వంటి క్రీడలు  ఆడేందుకు వీలు ఉంటుందని భవిష్యతులో వ్యాయామశాల ,ఈత కొలను వంటివి కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు.

Saturday, February 9, 2013

Bhajana Mandhiram Prarambham

                                                           భజన మందిరం ప్రారంభం 

తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం సమీపంలో శ్రీ సత్యసాయిబాబా వారి నూతన భజనమందిరం ప్రారంభిస్తున్నామని సేవాసమితి తెలిపింది. ప్రారంభ ఉత్స్చవం కార్యక్రమంలో  భాగంగా రుద్రాభిషేకం ,గణపతి హోమం,వాస్తు హోమం, శ్రీ సత్యసాయిబాబా హోమం,సుదర్శన హోమం,శ్రీ మహాలక్ష్మి హోమం,నవగ్రహ హోమంలను నిర్వహిస్తున్నామని తెలిపింది.అంతకముందు నగర సంకీర్తన జరగనున్నదని తెలిపింది.

Friday, February 8, 2013

Gutka And PanMasala Strictly Banned In Tadipatri

గుట్కా ,పాన్మసాలా  అమ్మితే చర్యలు   

తాడిపత్రిలో గుట్కా ,పాన్మసాలా అమ్మితే కటినమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం మునిసిపల్ కమిషనర్ రామ్మోహన రెడ్డి తెలిపారు. GV no. 6 ప్రకారం పట్టణంలో గుట్కా,పాన్మసాల అమ్మినా ,కొనుగోలు చేసిన, నిల్వచేసిన నేరమేనన్నారు .శనివారం (9/02/2013) నుంచి పట్టణం లోని పాన్ సెంటర్ల పై దాడులు చేస్తామన్నారు .

Friday, January 18, 2013

MahiLalaku Kuttu Machines Pampini

                                             మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి 

స్థానిక రోటరీ కార్యాలయంలో గురువారం(17/01/2013) ఐదుగురు మహిళలకు రోటరీ క్లబ్ సభ్యులు కుట్టు మిషన్లు అందచేసారు. ఒక్కో మహిళా రూ 2500 డిపాజిట్ చెల్లించగా మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు .ఇందులో రూ 500 రోటరీ క్లబ్ చెల్లిస్తుండగా మిగిలిన రూ 2 వేలు నాలుగు కంతుల్లో  చేలించాలిసి ఉంటుందన్నారు . తరువాత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

Monday, January 14, 2013

MahilaLaku Vaddi Leni RunaaLu

                                                      మహిళలకు వడ్డీ లేని రుణాలు  

కాకర్ల రంగనాధ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణి చేసారు.ఒక్కొక్కరికి రూ 5,000 చొప్పున 100 మందికి ఈ రుణాలను అందచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య   అతిధిగా హాజరుయిన మాజీ మునిసిపల్ చైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు రుణాలు అందిస్తే కుటుంభ పోషణకు ఉపయోగపడుతుందన్నారు .మొత్తం 20 నెలల పాటు కంతులు చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు .





                                                                     

Cricket Tournament Started

                                                         క్రికెట్ పోటీలు ప్రారంభం 
తాడిపత్రి న్యూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఈ నెల 12 వ తేది నుంచి ప్రైవేటు పాటశాలల కు  క్రికెట్  టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయాయి. స్థానిక ప్రభుత్వ జునియర్  కళాశాల మైదానంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాడిపత్రి క్రికెట్ అసోసిఎషేన్ సహకారంతో ఈ పోటీలను నిర్వహిన్స్తున్నట్లు న్యూ  ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్ .చంద్రమోహన్  రెడ్డి, సబ్  డివిజన్ కమిటి అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.ఈ పోటిలలో మొత్తం  26  ప్రైవేటు పాటశాలల విద్యార్థులు పాల్గొన్నారు.  మ్యాచ్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ ,టోర్నీ మొత్తం మీద మాన్ అఫ్ ది సిరీస్, బెస్ట్ బాట్స్ మాన్ ,బెస్ట్ బౌలర్ అవార్డులు ఉంటాయన్నారు. టోర్నీ విన్నర్ జట్టుకు రూ 5,116 నగదు ట్రోపీ ,మెడల్స్, రన్నర్ జట్టుకు రూ 2,516 నగదు,మెడల్స్. మూడో స్థానంలో నిలిచినా జట్టుకు రూ 1,116 నగదు బహుమతులు ఉంటాయాన్నారు .ఈ పోటీలు ఈ నెల 21 వ తేది వరకు జరుగుతాయని వారు తెలిపారు.

Friday, January 11, 2013

AkkannaPalli VruddhaaSramam Lo Annadhaanam.

                           వృద్ధాశ్రమం లో అన్నదానం 

పేరం రవిశంకర్ రెడ్డి 3 వ వర్ధంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అక్కన్నపల్లిలోని జాన్సి  మహిళా మండలి వృద్ధాశ్రమం లో వృద్ధులకు అన్నదానం చేసారు. అధ్యక్షుడు BC కులయప్ప ,కార్యదర్శి రాజనాయుడు తదిధరులు పాల్గొన్నారు.

Kondhanda Ranganatha Aalayamlo AnnaDhaanam

 కోదండ రంగనాథ ఆలయంలో అన్నదానం 

                                          
రెడ్డివారిపాలెం(తాడిపత్రి) కోదండ రంగనాథ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తులకు అన్నదానం చేసారు.ధనుర్మాసంలో 28 వ రోజు ఏట భక్తులకు అన్నసంతర్పణ జరుగుతుందని అర్చకుడు శేషాద్రి అయ్యంగార్ తెలిపారు. తెల్లవారు జమున స్వామి ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామిని పల్లకిలో అలంకరించి గ్రామొస్చవమ్ నిర్వహించారు.


*The pic is not original .Taken from Internet


District Shuttle Games Started

                                                  జిల్లా షటిల్  పోటీలు ప్రారంభం 

జిల్లా షటిల్ పోటీలను రూరల్ SI నరేంద్ర రెడ్డి ప్రారంభించారు VHP జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ మాట్లాడుతూ వివేకానందుని సందేశాలు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. బలమే  జీవనం,భాలహినతే మరణమని చాటిచెప్పారు, పోటిలలో యాడికి,రాయలచెరువు,కల్లూరు,పమిడి,అనంతపురం,గుంతకల్ నుంచి 80 జట్లు పాల్గొన్నాయి.SI నరేంద్ర రెడ్డి షటిల్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి సత్కరించారు.నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు 

Thursday, January 10, 2013

VivekaNandha Birthday Celebrations

                                              వివేకానంద జయంతి వేడుకలు రేపు.
స్వామి వివేకానంద జయంతి వేడుకలు శనివారం 150 వ జయంతి ఉత్స్చవ సమితి అధ్యక్షుడు రమేష్ నాథ్ రెడ్డి, జిల్లా సహకార్యధర్శి కత్తి రామచంద్ర రెడ్డి, జయరామిరెడ్డి తెలిపారు.శనివారం అంబేద్కర్ సర్కిల్ నుంచి అభయాంజినెయ స్వామి విగ్రహం వరకు శోభాయాత్ర జరుగుతుందని ,అనంతరం బహిరంగ సభ నిర్వహించనునట్లు తెలిపారు.

Pulse Polio Campaign On January 20th

                                  చుక్కల మందు జయప్రదం చేయండి 
ఈ నెల 20 న నిర్వహించనున్న చుక్కల మందు(పల్స్ పోలియో ) కార్యక్రామాన్ని  విజయవంతం  చేయాలనీ గురువారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. పురపాలకసంఘం కార్యాలయం వద్ద AE  రాచయ్య ప్రారంభించగా వైద్యులు పుల్లయ్య,సానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహ రెడ్డి, వైద్య సిబ్భంది పాల్గొన్నారు .ఐదేళ్ళు లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని నినాదాలు చేసారు.

Thursday, August 23, 2012

CV Raman Engineering Students Got Good Marks In JNTU University

ఇంజనీరింగ్  ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో CV రామన్ విద్యార్థుల ప్రతిభ 

JNTU అనంతపురం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సర్ CV రామన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థుల అత్యంత ప్రతిభ కనబరిచారు .  ఇందులో  ECE విభాగంలో కె వేణుగోపాల్ రాయల్ యునివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా 90 శాతం సాధించారు . అదేవిధంగా బి నాగజ్యోతి 86.3 శాతం, యం .రమ్య హారిక 85.2, కె సుదర్శన్ 84 శాతం, పి  మహేష్ 84 శాతం మార్కులు సాధించారు . వరుసగా 3 ఏళ్ళుగా  యునివర్సిటీ toppers  గా  CV రామన్ విద్యార్థులు రావడం జరిగింది అని కళాశాల చైర్మన్ BV భాస్కర్ రెడ్డి తెలియచేసారు. వీరితో పాటు 34 మంది విద్యార్థులు 80 శాతం మార్కులు సాధించారన్నారు . అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల చైర్మన్ BV భాస్కర్ రెడ్డి తో పాటు ప్రిన్సిపాల్ యం ఇందుధర్ రెడ్డి అభినందించారు. 

Save The Environment By Afforest The SimaRouba And Jatropah Plants

మొక్కలు నాటండి -పర్యావరణాన్ని కాపాడండి 

మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని ,మొక్కలు పెంచడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరచాలని మున్సిపల్  కమిషనర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మొక్కలు పెంచడంలో ఆసక్తి గలవారికి ప్రతి ఇంటికి ఉచితంగా మొక్కలను సరఫరా చేస్తామన్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్ నరసింహ రెడ్డి మాట్లాడుతూ దోమల నివారణకు సిమరూబి  మొక్కల పెంపకం శ్రేయస్కారమన్నారు . వీటి గాలిని పీల్చడం వలన కాన్సెర్ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువని తెలిపారు. మొదటి విడతగా 1500 ల సిమరూబి మొక్కలను ఉత్పత్తి చేస్తామన్నారు. అలాగే వేప,రంగారావి,కానుగ(jatropah ) మొక్కలు తమవద్ద కలవని వాటిని పెంచి పర్యావరణ అభివృద్ధి దోహద పడాలని ఆయన  తెలిపారు.

 
Design by Free WordPress Themes |